పరాయి మత చాందస వాద పాలకులచే మన మెదళ్లలో నాటబడ్డ బ్రాహ్మణ వ్యతిరేక సిద్ధాంతం అర్ధం చేసుకోవడానికి బుర్ర ఉంటే చాలు ఎవరికైనా. అపారమైన తెలివితేటలూ అవసరం లేదు. మన దేశాన్ని ముస్లింలు 800 సంవత్సరాలు, క్రైస్తవులు 200 సంవత్సరాలు అప్రతిహతంగా పాలించారు. మరి ఈ దేశంలో కొన్ని వర్గాల వారు అభివృద్ధి చెందలేకపోవడానికి పూర్తిగా బ్రాహ్మణులే కారణం అంటుంటే మన బుర్ర ఎప్పుడైనా ఆలోచించిందా?
మన దేశాన్ని పాలించిన చక్రవర్తులలో అధిక శాతం సూద్రులు కాదా ? ఉదాహరణకు చంద్రగుప్త మౌర్య, శ్రీ కృష్ణ దేవరాయ, ఛత్రపతి శివాజీ.. వీళ్ళెవరూ బ్రాహ్మణులు కాదే. బ్రాహ్మణుడైన చాణక్యుడు లేకుంటే చరిత్రలో చంద్ర గుప్తుని స్థానం ఏంటి అసలు. మన పురాణాల్లో గాని, కధల్లో గాని మనం ఏం చదువుకున్నాం? " అనగనగా ఒక ఊరిలో ఒక బీద బ్రాహ్మణుడు ఉండేవాడు. అతని కుటుంబానికి తినడానికి తిండి కూడా ఉండేది కాదు. ఒకరోజు అతను అడవిలో వెళ్తుండగా.... " ఇటువంటి కధలే కదా మనం చదువుకుంది. మరి అంత పేద బ్రాహ్మణుడు వేరే వారిపై వివక్ష ఎలా చూపించాడంటారు చెప్పండి?
నేడు హరిజనులుగా పేర్కొనబడుతున్న కొన్ని కులాల వారిని నిజానికి అణచివేసింది భూస్వాములు, క్రైస్తవులు, ముస్లింలు మాత్రమే. మొత్తం బ్రాహ్మణులలో అర్చక వృత్తి చేప్పట్టే వారూ కేవలం 20% మాత్రమే ఉంటారు. ఒకసారి ఆలోచించండి. మన స్నేహితుల్లో ఉన్న బ్రాహ్మణుల్లో ఎంతమంది అర్చక వృత్తి చెప్పట్టారో. నా స్నేహితుల్లో అర్చక వృత్తిని చేపట్టిన వారు అయితే ఎవరూ లేరు.
మేధావులు చెప్పినట్టు బ్రాహ్మణులకు మాత్రమే వేద విద్య అనుకుంటే నేడు మనకు ఆది కావ్యమైన రామాయణం ఉండేది కాదు. హిందువులకు అత్యంత పవిత్రమైన భగవద్గీత, పురాణాలు, మహా భారతాలే ఉండేవి కాదు. వీటిని రచించింది బ్రాహ్మణులు కాదు. ఎప్పటి సంగతో ఎందుకు హిందూ ధర్మ రక్షకుడు అయిన స్వామీ వివేకానంద బ్రాహ్మణుడు కాదు.
చరిత్రలో బ్రాహ్మణులపై దాడి :
హిందువుల మహా పుణ్య క్షేత్రం అయిన కాశీలో, గంగ ఒడ్డున మతం మారాడానికి నిరాకరించారు అన్న కారణంతో 150000 మంది బ్రాహ్మణులను, వారి పిల్లలను నరికి చంపి 10 మైళ్లకు సైతం కనపడే ఒక పెద్ద గుట్టగా వేసాడు ముస్లిం చక్రవర్తి #ఔరంగజేబు. ఆ బ్రాహ్మణుల జంధ్యాలు తెంచి గుట్టగా పోసి నిప్పంటించి చలి కాచుకున్నడు ఆ క్రూరుడు.
క్రైస్తవ సన్యాసి #సెయింట్ #జేవియర్ పోర్చుగల్ రాజుకి ఒక ఉత్తరం రాసాడు. దాని సారాశం ఏమంటే "బ్రాహ్మణులను లేకుండా చేస్తే భారతీయులందరూ తేలిగ్గా క్రైస్తవులుగా మారిపోతారు" అని. అర్ధం అయ్యింది కదా. బ్రాహ్మణ వ్యతిరేక సిద్ధాంతం వెనుక ఉన్న అసలు కుట్ర ఇదీ. వేల మంది గౌడ సరస్వతి బ్రాహ్మణులను కిరాతకంగా చంపించాడు నేర విచారణ పేరుతో. దీనినే మనం "Goa Inquisition" పేరుతో చరిత్రలో చదువుకుంటాం.
మైసూరు ప్రాంతం మేల్కొటేలో దీపావళి రోజున 800 మంది అయ్యంగార్ బ్రాహ్మణులను ఊచకోత కోయించాడు #టిప్పు #సుల్తాన్. అందుకే ఇప్పటికీ ఆ ప్రాంతంలో బ్రాహ్మణులు దీపావళి జరుపుకోరు.
ఇక కాశ్మీరీ పండిట్ల సంగతి తెలియనిది ఎవరికీ. మతం మారతారా లేక ఇళ్ళు విడిచిపెట్టి పోతారా అని నమాజ్ అనంతరం మైకుల్లో ప్రకటన చేస్తే ప్రాణాలు అరచేత పట్టుకుని ఢిల్లీ ప్లాటుఫారంల పైకి చేరి దిక్కు లేని జీవితం గడుపుతున్నారు వేలాది మంది కాశ్మీరీ పండిట్లు. జీహాదీల చేతుల్లో దాదాపుగా హత్య చేయబడ్డ వారూ 500000 మంది.
మీకు తెలుసా కాశీలో రిక్షా తొక్కుకుని జీవించే వారిలో అధిక శాతం బ్రాహ్మణులే. ఢిల్లీ రైల్వే స్టేషన్లో కూలీలుగా పని చేసేవారిలో 50% బ్రాహ్మణులే. ఆంధ్ర ప్రదేశ్లో వంట పని వారుగా పని చేసేవారిలో 75% బ్రాహ్మణులే. తమిళనాడు శ్రీ రంగనాధ స్వామి వారి గుళ్లో అర్చకుడిగా పనిచేసే బ్రాహ్మణుడి నెల జీతం కేవలం 300 రూపాయలు. ఈ బాధలు పడలేకే చదువుకున్న బ్రాహ్మణులు ఎక్కువగా సాఫ్ట్ వేర్ ఉద్యోగాలు చేస్తూ విదేశాల్లో స్థిరపడుతూ అక్కడ మన సంప్రదాయాలను ప్రచారం చేస్తున్నారు.
బ్రాహ్మణులు ప్రధానంగా జ్ఞానానికి ప్రాముఖ్యత ఇవ్వడం వల్ల, మత మార్పిడి మాఫియాలు ఎక్కువగా బ్రాహ్మణ వ్యతిరేక కధలు ప్రచారం చేస్తుంది. వారు చెప్పే తాటాకు, చెంబు కధలు చరిత్రలో ఎక్కడా కనపడవు. కాని ఒక అబద్దాన్ని పదే పదే చెబితే దాన్నే నిజం అనుకుంటుంది ఆలోచించే సమయం లేని లోకం. ఇదే వారి సిద్ధాంతం.
No comments:
Post a Comment